Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లకు శుభవార్త... రూ.499కే అమేజాన్ ప్రైమ్ సభ్యత్వం

  • 18-24 ఏళ్ల వయసు వారికే ఈ ఆఫర్
  • మై వొడాఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసి పొందొచ్చు
  • ఈ నెల 16లోపు చేసుకుంటే ప్రైమ్ సేల్ లో పాల్గొనే అవకాశం
వొడాఫోన్ తన ప్రీపెయిడ్ యూత్ కస్టమర్లకు చక్కని ఆఫర్ ను తీసుకొచ్చింది. 18-24 ఏళ్ల మధ్య వయసున్న ప్రీపెయిడ్ కస్టమర్లు అమేజాన్ ప్రైమ్ ఏడాది కాల సభ్యత్వాన్ని కేవలం రూ.499కే పొందొచ్చు. అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ప్రస్తుతం రూ.999గా ఉంది. అంటే 50 శాతం తక్కువకే పొందే అవకాశాన్ని వొడాఫోన్ కల్పించింది. ఇందుకోసం యూజర్లు మై వొడాఫోన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ప్రైమ్ మెంబర్ షిప్ కోసంరూ.499 చెల్లించాలి. తర్వాత తమ అమేజాన్ డాట్ ఇన్ పోర్టల్ లో తమ అకౌంట్లో లాగిన్ అయి ప్రైమ్ మెంబర్ షిప్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రైమ్ మెంబర్లకు అమేజాన్ ఉచితంగా సినిమాల కంటెంట్, మ్యూజిక్ ను అందించడంతోపాటు అమేజాన్ డాట్ ఇన్ లో ఉత్పత్తులపై తగ్గింపు ధరలు, వేగంగా డెలివరీ సేవలను అందిస్తోంది. ఈ నెల 16 నుంచి అమేజాన్ 36 గంటల పాటు ప్రత్యేకంగా ప్రైమ్ సేల్ నిర్వహిస్తోంది. ప్రైమ్ మెంబర్ల కోసమే తగ్గింపు ధరలతో అమ్మకాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 16వ తేదీలోపే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుంటే ప్రైమ్ సేల్ లో పాల్గొనవచ్చని వొడాఫోన్ సూచించింది. 
amazon prime
vodafone
discount offer

More Telugu News